ఇవీ చదవండి.. అభివృద్ధి కోసమే పాలనా వికేంద్రీకరణ: సజ్జల రామకృష్ణారెడ్డి
'ఐటీ సోదాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలి' - రాష్ట్రంలో ఐటీ సోదాలపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలురాష్ట్రంలో ఐటీ సోదాలపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు
రాష్ట్రంలో జరిగిన ఐటీ సోదాలపై చంద్రబాబు, లోకేశ్ నోరు విప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు పూర్వపు పీఏ నివాసంలో జరిగిన సోదాల్లో ఆయన బండారం బయటపడిందని ఆరోపించారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రైవేటు సెక్రెటరీగా పనిచేసిన శ్రీనివాస్ పలు లావాదేవీలకు సంబంధించి పన్నులు ఎగ్గొట్టారని విమర్శించారు. అతను పని చేసినప్పుడు రూ.2వేల కోట్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావుపైనా బొత్స ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రివర్గంలో చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి గడ్డమైనా పట్టుకుంటామని వ్యాఖ్యానించారు.
మంత్రి బొత్స సత్యనారాయణ
Last Updated : Feb 14, 2020, 5:06 PM IST