ETV Bharat / city

పర్యటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టండి: మంత్రి అవంతి - Minister Avanthi srinivas news

పర్యటక, సాంస్కృతిక, క్రీడా, పురావస్తు శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి అవంతి శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. త్వరలో ప్రారంభించనున్న క్రీడా ప్రాంగణాల స్థితిగతులపై ఆరా తీశారు.

Minister Avanti review on tourism
టూరిజంపై మంత్రి అవంతి సమీక్ష
author img

By

Published : Mar 30, 2021, 7:02 PM IST

నూతన విధానంతో రాష్ట్రంలో అన్ని పర్యటక ప్రాంతాలకు సరికొత్త శోభ సంతరించుకోనుందని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు చెప్పారు. సచివాలయంలోని మూడో బ్లాక్​లో పర్యటక, సాంస్కృతిక, క్రీడా, పురావస్తు శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు.

రాష్ట్రంలోని పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. క్రీడా ప్రాంగణాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు రాబట్టుకోవడంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఇదీ చదవండి:

వారిది అసమర్థ పాలన.. ఇవి అచ్ఛే దిన్ కాదు.. చచ్ఛే దిన్: తులసిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.