Minister Amarnath: ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సంబంధించి.. ఏపీలో 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని.. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 2025 నాటికి భారత్లో దేశవ్యాప్తంగా 50 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు వస్తాయని ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ సర్వే అంచనా వేసినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, సంబంధిత అంశాలపై.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన వర్చువల్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పరిశ్రమల శాఖ అధికారులు కరికాల వలెవన్, సుబ్రహ్మణ్యం, ఈడీబీ అధికారులు కూడా సమావేశానిక హాజరయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి.. కాలుష్య రహిత వాహనాల ఉత్పత్తి ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించటమే లక్ష్యమని తెలిపారు. రవాణా అనుసంధానం, మౌలిక వసతులు, సహజ, మానవ వనరులు ఏపీలో పుష్కలంగా ఉన్నాయన్నారు.
ఇవీ చదవండి: