పోర్టు అథారిటీ అధికారి ధ్రువీకరించాకే బోట్లుకు అనుమతి ఇవ్వనున్నట్లు... మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. పర్యటక బోట్ల నిర్వహణ, జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 300 ప్రైవేట్ బోట్లను చాలా వరకు తనిఖీ చేశామన్న అవంతి... సరంగులకు శిక్షణ ఇచ్చి పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే లైసెన్సులు ఇస్తామని స్పష్టం చేశారు. పర్యటక, నీటిపారుదల, పోలీసు, రెవెన్యూ అధికారులతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి... పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని పర్యటక బోట్లన్నీ మళ్లీ లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. బోట్ల అనుమతులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనున్నట్లు ముత్తంశెట్టి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 'ప్రశాంత్‌ను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం'