హైదరాబాద్ వేదికగా నిర్వహించిన బయో ఆసియా సదస్సు నిర్వహణను మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రశంసించారు. వైద్యరంగంలో ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ఇన్పేషెంట్ సేవల విభాగంలో కీలకంగా మారిందన్నారు.
బయో ఆసియా సదస్సులో భాగంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో... మంత్రి కేటీఆర్ వర్చువల్ చర్చా వేదికలో పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పేదలకు ఉపయోగపడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని కేటీఆర్ అన్నారు. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యరంగంలో డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
ఇదీ చూడండి: ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు