ETV Bharat / city

Met Gala-2021: అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై ప్రముఖ వ్యాపారవేత్త సతీమణి - amaravati news

ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో మెరిశారు.

మేఘా సుధారెడ్డి
Met Gala-2021
author img

By

Published : Sep 15, 2021, 3:44 PM IST

అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్‌ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక ‘మెట్‌ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన గౌనులో మెరిశారు. ఇప్పటివరకు ఈ షోలో బాలీవుడ్‌ హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు.

ఈ ఏడాది థీమ్‌ ‘అమెరికన్‌ ఇండిపెండెన్స్‌’కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకాక్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. దీని తయారీకి 250 గంటలు పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. మెట్‌ గాలాలో సుధారెడ్డి పాల్గొనడం ఇదే తొలిసారి. ఈఏడాది భారత్‌ నుంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం.

ఇదీ చూడండి:

'సాక్షి'పై కోర్టు ధిక్కరణ కేసు తెలంగాణ హైకోర్టుకు బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.