Medaram Jatara End : తెలంగాణలోని మేడారం మహాజాతర వైభవంగా ముగిసింది. భక్తకోటిని ఆశీర్వదించిన మేడారం దేవతలు వనప్రవేశం చేశారు. గిరిజన పూజారులు గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ భక్తులు సమర్పించిన బంగారాన్ని కొన్ని ముడుపులను సేకరించారు. తర్వాత ప్రధాన వడ్డెలు ఆయా దేవతలను తీసుకొని వారివారి నిజస్థానాలకు తీసుకెళ్లారు.
సారమ్మను కన్నెపల్లికి, సమ్మక్కను చిలకల గుట్టకు, పగిడిద్దరాజును పూనుకొండ్లకు, గోవిందరాజులును కొండాయికి తరలించారు. దేవతల వనప్రవేశంతో మహాజాతర ముగిసింది. ఈసారి కోటి 30 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా. అనంతరం మేడారం గద్దెల వద్ద భక్తుల దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి.
ఇదీ చదవండి : నిధుల సేకరణలో దుర్గ గుడి పాలకమండలి విఫలం.. ప్రణాళికలకే పరిమితమైన అభివృద్ధి పనులు !