Third wave: మూడో దశలో చిన్నపిల్లలకు కొవిడ్ వస్తుందనడానికి ఆధారాలు లేవు.. - కరోనా మూడో వేవ్‌పై నిపుణుల వ్యాఖ్యలు
కరోనా మూడో దశలో చిన్నపిల్లలకు వస్తుందనడానికి ఏవిధమైన ఆధారాలూ లేవని.. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వైద్యమండలి ఛైర్మన్ సాంబశివారెడ్డి చెప్పారు. థర్డ్ వేవ్‌లో చిన్నపిల్లలపై ప్రభావం చూపితే ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని ఆ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. లాక్‌డౌన్ ఆంక్షలు ఒక్కసారిగే ఎత్తేస్తే కేసులు పెరిగే ప్రమాదం ఉందని.. క్రమంగా సడలిస్తామని సాంబశివారెడ్డి స్పష్టం చేశారు.