ETV Bharat / city

వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ కేట‌గిరి సీట్లు.. తెలంగాణ విద్యార్థులకే - తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు

MBBS B CATEGORY SEATS : తెలంగాణ వైద్య విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్​న్యూస్​ చెప్పింది. సుమారు వెయ్యికి పైగా విద్యార్థులకు ఎంబీబీఎస్​ బీ కేటగిరి సీట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్‌, బీడీఎస్ ప్రవేశాల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి

MBBS B CATEGORY SEATS
MBBS B CATEGORY SEATS
author img

By

Published : Sep 29, 2022, 3:26 PM IST

MBBS B CATEGORY SEATS : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వైద్య విద్యార్థులకు శుభవార్త చెప్పింది. వెయ్యికి పైగా తెలంగాణ విద్యార్థులకు ఎంబీబీఎస్ బీ కేటగిరి సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీ సీట్లలో 85శాతం లోకల్ రిజర్వేషన్ వర్తించనుంది. ఇకనుంచి కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటాలో సీట్లు భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్ ప్రవేశాల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ సీట్లు లభించేలా కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. బీ కేటగిరీలో 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయించింది.

MBBS seats in Telangana : తెలంగాణలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి ప్రభుత్వ రంగంలో కొత్తగా 1200 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే మహబూబాబాద్‌, జగిత్యాల, సంగారెడ్డి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తగూడెం వైద్య కళాశాలలకు ఒక్కో దాంట్లో 150 చొప్పున కొత్తగా 900 సీట్లకు అనుమతి లభించింది. రామగుండంలో 150 సీట్లకు అనుమతి ఇవ్వడానికి అంగీకార పత్రాన్ని (లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌) జాతీయ వైద్య కమిషన్‌ ఇప్పటికే పంపించింది. ఇక మంచిర్యాలకు మాత్రమే అనుమతి రావాల్సి ఉంది. ఈ కళాశాలకు కూడా 150 సీట్లు ఇచ్చే అవకాశాలున్నాయి.

MBBS seats in Telangana 2022-23 : ప్రైవేటు రంగంలో గత ఏడాది టీఆర్‌ఆర్‌, మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. టీఆర్‌ఆర్‌, మహావీర్‌ కళాశాలల విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేశారు. ఎంఎన్‌ఆర్‌ కళాశాలపై ఇంకా సందిగ్ధత తొలగలేదు. ఈ క్రమంలో 2022-23 వైద్యవిద్యా సంవత్సరానికి సంబంధించి ఈ కళాశాలకు తాజాగా అనుమతులు వచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్‌ఆర్‌, మహావీర్‌ కళాశాలల్లోనూ తుదివిడత తనిఖీలు పూర్తి చేసినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ కళాశాలల సీట్లు కొనసాగే అవకాశాలే ఎక్కువని సమాచారం. మొత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో కలిపి 6,240 సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

అఖిలభారత కోటాకు 375 సీట్లు.. జమ్మూ కశ్మీర్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్యకళాశాలల నుంచి సేకరించిన 15 శాతం సీట్లతో నిర్వహించనున్న అఖిలభారతస్థాయి ప్రవేశాల ప్రక్రియను రాష్ట్ర ప్రవేశాల కంటే ముందుగానే నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి అఖిలభారత కోటాకు గత ఏడాది 240 ఎంబీబీఎస్‌ సీట్లు ఇవ్వగా, ఈ ఏడాది సీట్లు పెరగడంతో ఆ సంఖ్య 375కు చేరనుంది. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో 190 సీట్లు రాష్ట్రానికి అదనంగా వస్తాయి. అఖిలభారత కోటాలో రెండు విడతల ప్రవేశ ప్రక్రియల అనంతరం మిగిలిన సీట్లను రాష్ట్రాలకు కేటాయిస్తారు. రాష్ట్ర ప్రవేశాలకు, అఖిలభారత ప్రవేశాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జారాష్ట్రస్థాయిలో కన్వీనర్‌, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్లను కాళోజీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.