ETV Bharat / city

కిచెన్​ని శుభ్రం చేయడం ఎలా? - శుభ్రంగా వంటగది

అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు తాండవం చేస్తున్న వేళ పరిశుభ్రతకు పెద్ద పీట వేయాలి. ముఖ్యంగా వంటగదిని  శుభ్రంగా, క్రిమిరహితంగా పెట్టుకోవాలి..

kitchen cleaning
కిచెన్​ క్లీనింగ్​
author img

By

Published : Apr 29, 2021, 11:40 AM IST

వంటింట్లో..

ఆ ఐదు అతిశుభ్రంగా!
వంటింట్లో బండలు శుభ్రంగా ఉంచుకోవాలి

వంటింట్లో... కూరగాయలు కడగడం, కోయడం, పాత్రలు శుభ్రం చేయడం... ఇలా రకరకాల పనులన్నీ దీని చుట్టుపక్కలే చేస్తుంటాం. దీనిపై బోలెడు సంఖ్యలో సూక్ష్మజీవులు ఆవాసం ఉంటాయి. కాబట్టి ఈ బండను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. డిటర్జెంట్‌ కలిపిన నీటితో శుభ్రం చేసి పొడి వస్త్రంతో తుడవాలి.

సింకు

ఆ ఐదు అతిశుభ్రంగా!
సింకు బాగా ముఖ్యం

సింకు... జిడ్డు పాత్రలు, మిగిలిపోయిన ఆహార వ్యర్థాలు.... ఇలా చూడటానికి చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇక్కడే పాత్రలు శుభ్రం చేస్తాం. అయితే దీన్ని కూడా ఎప్పటికప్పుడు కడిగేయాలి. వెనిగర్‌, వంటసోడాలను సమాన పరిమాణాల్లో తీసుకుని వేడినీటిలో కలపాలి. ఈ నీటిలో స్పాంజ్‌ను ముంచి దాంతో సింకుని శుభ్రం చేయాలి.

ఫ్రిజ్

ఆ ఐదు అతిశుభ్రంగా!
తరచూ శుభ్రం చేయాలి

ఫ్రిజ్‌... పదార్థాల కోసం దీన్ని పదే పదే తెరుస్తున్నప్పుడు మన చేతికి ఉండే క్రిములన్నీ ఫ్రిజ్‌ డోర్‌పై ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. ఇదిలా కొనసాగితే కొత్త ఇబ్బందులు తప్పవు. కాబట్టి రెండు మూడు రోజులకోసారి ఫ్రిజ్‌ శుభ్రత విషయంలో కాస్త పట్టించుకోవాలి. ఓ పాత్రలో కొన్ని నీళ్లు పోసి అందులో చెంచా ఉప్పు లేదా వంటసోడా కలపాలి. ఈ నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని ముంచి ఫ్రిజ్‌నంతా తుడవాలి. ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిస్తే సరి.

మసిబట్ట

ఆ ఐదు అతిశుభ్రంగా!
రోజూ ఉతకాలి

మసిబట్ట... వంటగదిలో నిరాదరణకు గురయ్యే వస్తువుల్లో మసిబట్టను చెప్పొచ్చు. దీనిపై క్రిముల సంఖ్యను చెప్పలేం. ఇవి చూడటానికి మాములుగా కనిపించినా పూర్తిగా హానికారక బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. కాబట్టి రోజూ ఉతకాల్సిందే. వేడినీటిలో కాస్తంత డిటర్జెంట్‌ వేసి ఉతికితే క్రిములు చనిపోతాయి. మురికీ పోతుంది.

చెత్త బుట్ట

ఆ ఐదు అతిశుభ్రంగా!
కవరు మారుస్తూ ఉండాలి

చెత్త బుట్ట... ఇది సూక్ష్మజీవులకు అడ్డా. కాబట్టి దీని కవరును ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. గోరువెచ్చటి నీటిలో కాస్తంత డిటర్జెంట్‌, డెటాల్‌ వేసి బాగా కడిగితే సరి.

ఇదీ చూడండి: తెలుగునాట వివాహ వేడుకలపై సందిగ్ధత..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.