రాజధాని గ్రామాల్లో 51వ రోజు రైతుల ఆందోళన - అమరావతి రైతుల ఆందోళనలు
రాజధాని గ్రామాల్లో 51వ రోజూ ఆందోళనలు హోరెత్తుతున్నాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడిలో దీక్షలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కితీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం ప్రతి గ్రామంలో పర్యటిస్తూ రైతుల అభిప్రాయాలు తెలుసుకోవాలని కోరుతున్నారు.