ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి 'మనబడి నాడు-నేడు'

నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మనబడి నాడు-నేడు కార్యక్రమం అమలులోకి వచ్చింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయా జిల్లాల్లోని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి 'మనబడి నాడు-నేడు'
author img

By

Published : Nov 15, 2019, 6:21 AM IST

విశాఖ పరిధిలోని చినగదిలి మండలం తోటగరువు పాఠశాలలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గిడిజాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరై నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యావిధానంలో సంస్కరణలు తీసుకొచ్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి 'మనబడి నాడు-నేడు'

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంగ్లమాధ్యమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. తిరుపతి మంగళంలోని ట్రెండ్స్‌ జెడ్పీ పాఠశాలలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, మత్య్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యనించారు. తూర్పుగోదావరి జిల్లా పుణ్యక్షేత్రం ప్రభుత్వ పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలో విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా ఉత్తరావల్లి ప్రభుత్వ ఉన్నత ఉన్నత పాఠశాలలో నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించిన ఆయన..ఈ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారతాయన్నారు.

ఇదీచదవండి

ప్రజా సమస్యలపై మాట్లాడొద్దంటే కుదరదు: తమ్మినేని

Intro:Ap_gnt_63_14_nadu_nedu_home_minister_avb_AP10034

contributor: k. vara prasad (prathipadu),guntur

Anchor : విద్యా విధానంలో పూర్తిగా సంస్కరణలు తీసుకువచ్చే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి నాడు -నేడు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్య కోసం కేవలం 20 కోట్లు కేటాయించిందని.... ముఖ్యమంత్రి జగన్ 1500 కోట్లు మంజూరు చేసి విద్యను ప్రోత్సాహిస్తున్నారన్నారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎందుకు బాధపడుతున్నారో అర్ధం కావడంలేదన్నారు. సచివాలయంలో దరఖాస్తు చేసుకున్న మూడు రోజులలో పధకాలను వర్తింపజేసేలా చూస్తామన్నారు.

బైట్ : మేకతోటి సుచరిత, హోంమంత్రి

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.