ETV Bharat / city

జీహెచ్​ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా

తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేస్తామని భాజపా ప్రకటించింది. జీహెచ్​ఎంసీ భాజపా ఎన్నికల మేనిఫెస్టోను... మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విడుదల చేశారు. సామాన్యుల ఆకాంక్షల మేరకే ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లు ఆయన తెలిపారు. వరదసాయం కింద అర్హులందరికీ... 25 వేల రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలో వేస్తామని మేనిఫెస్టోలో భాజపా హామీ ఇచ్చింది.

తెలంగాణ:  నీరు, కరెంట్ ఫ్రీ, ఆస్తిపన్ను మాఫీ: భాజపా హామీలు

author img

By

Published : Nov 26, 2020, 11:15 PM IST

ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా తెలంగాణ ప్రజలపై కేసీఆర్‌ సర్కారు... 15 వేల కోట్ల రూపాయల భారం మోపిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ విమర్శించారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దుచేస్తామని ఆయన ప్రకటించారు. జీహెచ్​ఎంసీ భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన ఫడణవీస్‌... హైదరాబాద్‌ వరదల సమయంలో తెరాస సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే... నగరం మునిగిపోయిందని అన్నారు. వరదసాయం కింద అర్హులందరికీ 25వేల రూపాయల చొప్పున అందిస్తామని ప్రకటించారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని... తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రధానంత్రి ఆవాస్‌ యోజన కింద లక్ష ఇళ్ల నిర్మాణం... అనుమతులు అవసరం లేకుండా 125 గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణం చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. ఉచిత తాగునీటి సరఫరా, 100 యూనిట్ల వరకు విద్యుత్‌ వాడుకునే పేదల ఇళ్లు సహా... కులవృత్తులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని తెలిపారు. జీహెచ్​ఎంసీలో విజయం సాధిస్తే భాజపా కార్పొరేటర్లు యజమానులుగా కాకుండా సేవకులుగా నగరవాసుల కష్టాలు తీరుస్తారని ఫడణవీస్‌ తెలిపారు.

పాత నగరాన్ని ఓవైసీ, మిగతా నగరాన్ని... సీఎం చంద్రశేఖర్‌రావు పంచుకున్నారు. ఇది వాళ్ల సొంత ఆస్తిగా భావిస్తున్నారు. ఈ నగరాన్ని ప్రజలకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం. ఇది ఓవైసీ నగరం కాదు.. చంద్రశేఖర్‌రావు నగరం కాదు. ఇది హైదరాబాద్‌... తెలంగాణ ప్రజల నగరం. సొంత ఆస్తిగా మార్చుకున్నారో... దాన్ని తిరిగి హైదరాబాద్‌ ప్రజలకిస్తాం. నగరపాలికను మళ్లీ ప్రజావేదికగా మారుస్తాం.

  • దేవేంద్ర ఫడణవీస్, మాహారాష్ట్ర మాజీ సీఎం

గ్రేటర్ పరిధిలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే అవసరం లేకుండా... అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని భాజపా ప్రకటించింది. మెట్రోరైలు, సిటీబస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం, గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు... మెట్రో, ఎంఎంటీఎస్ సేవలు విస్తరిస్తామని తెలిపింది. గ్రేటర్ పరిధిలో ద్విచక్రవాహనాలు, ఆటోలపై... ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ చేస్తామని... విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని... హామీ ఇచ్చింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని... భాజపా వివరించింది. మూసీ ప్రక్షాళనకు 10 వేల కోట్లు ఇస్తామని తెలిపింది. ట్రాఫిక్ సమస్య పరిష్కరానికి... జంక్షన్‌కు ఒక పైవంతెన కడతామని, రోడ్లకు... 15 రోజుల్లోనే మరమ్మతు చేస్తామని తెలిపింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 28వేల నియామకాలు చేపడతామని... ప్రత్యేక ప్యాకేజీతో పాతబస్తీ అభివృద్దికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

జీహెచ్‌ఎంసీ-భాజపా మేనిఫెస్టో ముఖ్యాంశాలు:

  • వరదసాయం కింద అర్హులకు రూ. 25 వేలు
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లక్ష ఇళ్లు
  • ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు
  • అనుమతులు లేకుండానే 125 గజాల వరకు స్థలంలో ఇంటి నిర్మాణం
  • ఉచిత తాగునీటి సరఫరా, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌
  • గ్రేటర్‌ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్ పంపిణీ
  • మెట్రోరైలు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో, ఎంఎంటీఎస్‌ విస్తరణ
  • గ్రేటర్ పరిధిలో ద్విచక్రవాహనాలు, ఆటోలపై చలాన్ల బకాయిలు రద్దు
  • ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ
  • విద్యార్థులకు... ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం
  • ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు
  • మూసీ ప్రక్షాళనకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు
  • ట్రాఫిక్ సమస్య పరిష్కరానికి జంక్షన్‌కు ఒక పై వంతెన
  • 15 రోజుల్లోనే రోడ్ల మరమ్మతులకు హామీ
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 28వేల నియామకాలు
  • ప్రత్యేక ప్యాకేజీతో పాతబస్తీ అభివృద్ది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.