రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. ఒడిశా - ఉత్తరాంధ్ర తీరం వెంబడి.. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రకటించింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. జాలర్లు సముద్రంలో వేటకు వెళ్లవద్దు హెచ్చరించింది.
ఇదీ చదవండి: