ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కంపూర్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగులమందు తాగి యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు గణేశ్, సీతాబాయిగా గుర్తించారు. ఉట్నూర్ మండలం కన్నాపూర్‌కు చెందిన గణేశ్, కంపూర్‌కు చెందిన సీతాబాయికి గతంలో నిశ్చితార్థం అయింది. లాక్డౌన్ కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు.
లాక్డౌన్తో పెళ్లి వాయిదా.. ప్రేమికుల ఆత్మహత్య - నిశ్చితార్థం తర్వాత ప్రేమికుల ఆత్మహత్య
తెలంగాణాలో ఓ ప్రేమజంట పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో వీరిద్దరికి నిశ్చితార్థం అయింది కానీ లాక్డౌన్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో వివరాలు తెలియాల్సి ఉంది.

లాక్డౌన్తో పెళ్లి వాయిదా.. ప్రేమికుల ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కంపూర్‌లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగులమందు తాగి యువతీయువకుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు గణేశ్, సీతాబాయిగా గుర్తించారు. ఉట్నూర్ మండలం కన్నాపూర్‌కు చెందిన గణేశ్, కంపూర్‌కు చెందిన సీతాబాయికి గతంలో నిశ్చితార్థం అయింది. లాక్డౌన్ కారణంగా వారి పెళ్లి వాయిదా పడింది. వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు.
ఇదీ చూడండి: సీఐ దురుసు ప్రవర్తన... మహిళ ఆత్మహత్యాయత్నం!