ప్రజలకు భారంగా మారిన కరెంట్ ఛార్జీలు(power crisis in andhra pradesh news) తగ్గించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు(Lokesh letter to CM Jagan news). ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. విద్యుత్ ట్రూఅప్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టాలన్న లోకేశ్.. వైకాపా పాలనలో ఆరు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.
వైకాపా పాలనలో విద్యుత్ కోతలు, బిల్లుల వాతలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని లోకేశ్ దుయ్యబట్టారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.26,261 కోట్ల అప్పులు చేశారని.. ఈ భారాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతో లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యూనిట్‌ను గరిష్ఠంగా రూ.20కు ఎందుకు కొంటున్నారని (nara lokesh on power crisis news) ప్రశ్నించారు. యూనిట్‌కి అదనంగా ఇస్తున్న రూ.16 ఎవరి జేబులోకి వెళ్తోందని..? నిలదీశారు.
ఇదీ చదవండి
భవిష్యత్తులో అధికారికంగా కరెంటు కోతలు రావచ్చు: ప్రభుత్వ సలహాదారు సజ్జల