ETV Bharat / city

'అప్పుడు మద్దతిచ్చి... ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారు..?'​

ఎన్​ఆర్​సీ బిల్లుకు మద్దతు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్... కడప సభలో అమలు చెయ్యబోమని చెప్పటంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఘాటుగా స్పందించారు. మడమ తిప్పే నాయకుడు కాబట్టే... ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా వైకాపా ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

lokesh tweet on cm jagan
సీఎం జగన్​పై లోకేష్​ ట్వీట్
author img

By

Published : Dec 24, 2019, 12:42 PM IST

సీఎం జగన్​పై లోకేశ్​ ట్వీట్

వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్​ను పెయిడ్ ఆర్టిస్ట్​గా గుర్తించడం మంచిదంటూ... తెదేపా ముఖ్యనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. పార్లమెంట్​లో ఎన్​ఆర్​సీకి మద్దతు ఇచ్చి... అసెంబ్లీలో నోటిఫికేషన్​లు ఇస్తూ... బయట మాత్రం తాము ఆ బిల్లుకు ​వ్యతిరేకమని ప్రచారం చేస్తారని ధ్వజమెత్తారు. 16 ఆగస్టు 2019న ఎన్​ఆర్​సీపై గెజిట్ నోటిఫికేషన్​ ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన విషయం గుర్తుచేశారు. కడప సభలో పౌరసత్వ బిల్లు అమలు చెయ్యబోమని సీఎం జగన్ చెప్పడం సిగ్గుచేటని తీవ్రంగా తప్పుబట్టారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కాబట్టి... ఎంతకైనా దిగజారుతారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:
'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.