ETV Bharat / city

'ఆంగ్ల మాధ్యమం' జగన్ గారి మరో అనాలోచిత నిర్ణయం - lokesh tweets on jagan news

వైకాపా ప్రభుత్వ నిర్ణయాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టటం, అగ్రిగోల్ట్ బాధితులకు కేటాయించిన సొమ్ములో కోత విధించటంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు.

నారా లోకేశ్
author img

By

Published : Nov 8, 2019, 12:08 AM IST

వైకాపా సర్కార్ జీవో 81ను విడుదల చేయటంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రభుత్వ తొందరపాటు చర్యల వలన తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ఈ నిర్ణయాన్ని ఓసారి సమీక్షించుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. హడావుడిగా ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చూస్తే వైకాపా నాయకులు తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనలు ప్రవేశపెట్టడం జగన్ గారి మరో అనాలోచిత నిర్ణయమని ఎద్దేవా చేశారు.

కోట్లలో కోత దేనికి సంకేతం

వైకాపా బాధితులకు వైకాపా న్యాయం చేయడం కలే అని నారా లోకేశ్ విమర్శించారు. అగ్రిగోల్డ్ కుంభకోణం జరిగింది మహామేత హయాంలోనే అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయడానికి వైకాపా నేతలు గతంలో కేసులు వేసి ఆస్తుల కొనుగోలుకు ముందుకొచ్చిన కంపెనీలను బెదిరించారని ఆరోపించారు. బాధితులకు రూ.1,150 కోట్ల మొత్తాన్ని చెల్లిస్తామని మడమ తిప్పటం వెనుక రహస్యం ఏంటని ప్రశ్నించారు. తెదేపా హయాంలో బాధితులకు కేటాయించిన రూ.363 కోట్లలో ఇప్పుడు కోత దేనికి సంకేతమని నిలదీశారు. అగ్రిగోల్డ్ స్కామ్ సూత్రధారులతో జె-ట్యాక్స్ కోసం జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చేవరకూ బాధితులకు వైకాపా న్యాయం చేయదని ట్వీట్ చేశారు.

Ap_vsp_08_07_industries_minister_mekapati_pc_avb_3031531 యాంకర్ : పరిశ్రమ లు రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్లిపోతున్నాయన్నది అవాస్తవమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అదాని గ్రూప్ కూడా త్వరలోనే తమ పెట్టుబడులు, పరిశ్రమ ఏర్పాటుపై స్పష్టత ఇస్తుందని చెప్పారు. విశాఖ లో మీడియాతో మాట్లాడుతూ, తాము వాస్తవంగా పరిశ్రమ పెట్టే వారికే అవసరమైన మేర ల్యాండ్ బాంక్ కేటాయిస్తున్నామన్నారు. విభజన చట్టం ప్రకారం రావాల్సిన పోర్ట్ దుగరాజపట్నం కాకుండా రామాయపట్నం ప్రత్యామ్నాయము అని ప్రభుత్వం భావిస్తోందని, దీనిపై కేంద్రమంత్రి తో మాట్లాడ తామన్నారు. తాము ప్రభుత్వం లోకి వచ్చేసరికి 4000 కోట్లు పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఉంది....వాటిని ఒక ప్రణాళిక ప్రకారం ఇచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు.ప్రాధాన్యం ప్రకారం వాటిని ఇస్తామని, ఐటీ లో కూడా పూర్తిగా సంస్కరణలు తీసుకు వచ్చేందుకు యత్నిస్తున్నామన్నారు. టి హబ్ లాగా, ఏ పి హబ్ తీసుకువచ్చే యత్నం చేస్తున్నామని వివరించారు. బైట్ : మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి,
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.