నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయి. డిసెంబరు 31న ఒక్క రోజే రూ. 82 కోట్లు మద్యం అమ్ముడైంది. రాష్ట్రంలో రోజుకు సగటున 50 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతాయి. కొత్త సంవత్సరం సందర్భంగా... దాదాపు రెట్టింపు మద్యం అమ్ముడైంది. ఏటా డిసెంబరు 31న మద్యం దుకాణాలకు రాత్రి 12 వరకూ, బార్లకు రాత్రి 1 వరకూ తెరిచి ఉంచేందుకు అనుమతిస్తారు. ఈ ఏడాది అలాంటి అనుమతులేమి ఇవ్వలేదు. రోజూలాగే రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు, 10 గంటలకు బార్లు మూతపడిన...అమ్ముడైన మద్యం విలువ మాత్రం తగ్గలేదు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు మద్యం తాగి వాహనాలు నడుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 794 మంది పట్టుబడ్డారు. అత్యధికంగా విశాఖపట్నం నగర కమిషనరేట్‌లో 287 మంది పట్టుబడ్డారు. మద్యం తాగి వాహనాలు నడపటం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో కొంతమంది వాహనచోదకులు ఉండగా.... మరికొందరు రహదారులపై వెళ్తున్న వారూ ఉన్నారు . మొత్తం 30 ప్రమాదాల్లో 30 మంది గాయపడ్డారు.
ఇదీ చూడండి: బడి కాదు... బంగారు భవిష్యత్‌కు బాట వేసే గుడి