రాష్ట్రంలో మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. మద్యపానాన్ని నిరుత్సాహపరచడం, దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలు 25 శాతం పెంచాలని నిర్ణయించింది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ఆదేశించింది. రానున్న రోజుల్లో దుకాణాల సంఖ్య మరిన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. భౌతికదూరం పాటించి మద్యం విక్రయించాలని ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చదవండి : గుంటూరు జిల్లాలో కొత్తగా 11 మందికి కరోనా.. 319కి చేరిన కేసులు