ETV Bharat / city

Vinayaka Chaturthi Wishes: ప్రజలకు నేతల వినాయక చతుర్థి శుభాకాంక్షలు - వినాయక చవితి వార్తలు

Vinayaka Chaturthi Wishes: వినాయక చవితిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి ప్రజలందరికీ సకల శుభాలూ కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్​, జనసేన అధినేత పవన్​ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... ప్రజలందరికీ సుఖసంతోషాలు గణేశుడు ప్రసాదించాలని కోరుకున్నారు.

Vinayaka Chaturthi
నేతలు శుభాకాంక్షలు
author img

By

Published : Aug 31, 2022, 12:52 PM IST

Updated : Aug 31, 2022, 1:58 PM IST

Vinayaka Chaturthi Wishes: రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు సహా పవన్​ కల్యాణ్​, నారా లోకేశ్​లు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. గణేశ్‌ ఉత్సవాలపై ఆంక్షలు విధించటం సరికాదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనుమతుల పేరుతో గణేశ్‌ మండపాలకు ఆంక్షలు విధించారని మండిపడ్డారు. గణేశ్‌ నవరాత్రులు అంటే పండగ మాత్రమే కాదని... స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసింది గణేశ్‌ పండగ అని అన్నారు. ప్రజల్లో జాతీయ భావాన్ని నింపేందుకు దోహదపడిందని తెలిపారు.

  • గణనాయకుని భక్తి శ్రద్దలతో ఆరాధిస్తున్న ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఆ విఘేశ్వరుడు మీ సంకల్పాలన్నిటినీ నెరవేర్చాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను.(2/2)

    — N Chandrababu Naidu (@ncbn) August 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాష్ట్ర ప్రజలకు జనసేన అదినేత పవన్‌ కల్యాణ్‌ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధి కలగాలని కోరుకున్నారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

రెండు తెలుగురాష్ట్రాలలోని ప్రజలకు, దేశవిదేశాల్లోని తెలుగువారందరికీ హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని విఘ్నాలను అధిగమించి రెండు తెలుగు రాష్ట్రాలు... దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రాలు కావాలని ఆకాక్షించారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి కల్పన, సంక్షేమ రంగాల్లో అగ్రగామి కావాలన్నారు. విఘ్నేశ్వరుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరారు.

ప్రజలందరికీ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వినాయ‌క‌చ‌వితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాల‌తో క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నాలు తొల‌గి పనులన్నీ దిగ్విజ‌యం కావాలని కోరుకున్నారు.

  • వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు. ఆయురారోగ్యాల‌తో అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని గ‌ణ‌నాథుడిని వేడుకుంటున్నాను. త‌ల‌పెట్టే మంచి ప‌నుల‌కి విఘ్నాలు తొల‌గి, దిగ్విజ‌యం అయ్యేందుకు వినాయ‌కుడు ఆశీస్సులు అంద‌రికీ తోడ‌వ్వాల‌ని ప్రార్థిస్తున్నాను.#vinayakachaturthi

    — Lokesh Nara (@naralokesh) August 31, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Aug 31, 2022, 1:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.