Jada Sranan Kumar petition రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలపై హైకోర్టులో సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సర్వీసుల్లో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగానికి, సర్వీసు నిబంధనలకు విరుద్ధమని శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం వెంకటరామిరెడ్డి వ్యాఖ్యలపై అతడిని సస్పెండ్ చేయాలని, అలా చేయకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ అని, న్యాయవాదులు ముక్త కంఠంతో ఖండించాలన్నారు.
ఇవీ చదవండి: