ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ. 4 కోట్ల భారీ విరాళం అందించింది. మొదటి విడత నాడు - నేడులో భాగంగా.. 4 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ మొత్తాన్ని ఇచ్చింది. తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు ఈ విరాళాన్ని వినియోగించనున్నారు.
రెండో, మూడో విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో.. సొంతగా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు లారస్ ల్యాబ్స్ ప్రతినిధులు వెల్లడించారు. చెక్కు సహా సంబంధిత పత్రాలను సంస్థ ఉపాధ్యక్షుడు చావా నరసింహరావు, సీనియర్ మేనేజర్ రామకృష్ణ.. సీఎం జగన్కు అందించారు. కనెక్ట్ టు ఆంధ్ర సీఈవో వి.కోటేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: