ETV Bharat / city

రాబోయే రెండురోజుల్లో.. రాష్ట్రంలో వర్షాలు! - Southwest monsoons

Southwest Monsoons: రాగల రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ గాలుల ప్రభావంతో రుతుపవనాలు వేగంగా భారత్​ వైపు కదులుతున్నాయని తెలిపింది.

rains in ap
Weather Updates
author img

By

Published : May 27, 2022, 3:29 PM IST

Latest News on Southwest Monsoons: నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగం వైపు వేగంగా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇవి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, మాల్దీవులపై పూర్తిగా ఆవరించాయని వెల్లడించింది. బలమైన పశ్చిమగాలుల కారణంగా నైరుతీ రుతుపవనాలు వేగంగా కదులుతున్నట్టు తెలిచేసింది. అంచనా కంటే ముందుగానే నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశమున్నట్లు స్పష్టం చేసింది. ఉపగ్రహ ఛాయాచిత్రాల ప్రకారం కేరళ తీరప్రాంతాలు, అరేబియా సముద్రంపై దట్టంగా మేఘాలు కమ్ముకున్నట్టు వెల్లడించింది.

రెండు మూడు రోజుల్లోనే కేరళ భూభాగాన్ని నైరుతీ రుతుపవనాలు తాకే అవకాశముందని ఐఎండీ తెలియచేసింది. నైరుతీ రుతుపవనాలు ఆగమనానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది. మరోవైపు ఏపీ, యానాంలపై ప్రస్తతం పశ్చిమ గాలుల ప్రభావం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల రెండు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని అమరావతి కేంద్రం అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.