ETV Bharat / city

ఆ భూములు.. నోషనల్‌ ఖాతాల చెర వీడేదెప్పుడో? - ఏపీ తాజా వార్తలు

ఆ భూమి వారి సొంతం. ఏటా సాగు చేస్తున్నా భూ యాజమాన్య హక్కులు మాత్రం లభించడం లేదు. దీంతో పీఎం కిసాన్‌, రైతు భరోసాతోపాటు బ్యాంకు రుణాలూ పొందలేకపోతున్నారు. ప్రైవేటు వారిని ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. చివరికి అమ్ముకోవాలన్నా కుదరడం లేదు.ఈ సమస్యను పరిష్కరించాలని ఈ రైతులు అధికారుల చుట్టూ ఏళ్లతరబడి తిరుగుతున్నా పరిష్కారం లభించడం లేదు. భూముల రీసర్వే సందర్భంగా అయినా వీటికి మోక్షం చూపాలని వారు వేడుకుంటున్నారు.

land issues
land issues
author img

By

Published : Apr 1, 2021, 8:11 AM IST

వెబ్‌ల్యాండ్‌ కోసమని.. సర్వేనంబర్లు, సబ్‌ డివిజన్లు, ఖాతా నంబరు, పట్టాదారు పేరుతో దస్త్రాలను ఆన్‌లైన్‌ చేశారు. పేరు లేని, పట్టా నంబర్లు ఇవ్వని భూములనూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే.. ఏదో ఒక ఖాతా సంఖ్య ఇవ్వాలి. అందుకోసం తాత్కాలికంగా నోషనల్‌ ఖాతా సృష్టించి నమోదు చేశారు. వీటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ‘ఇతరులు’ అనే పేరు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా.. వీటిని సరిదిద్ది శాశ్వత ఖాతా సంఖ్యలు కేటాయించకపోవడంతో వేల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనే 8 లక్షల వరకు నోషనల్‌ ఖాతాల పరిధిలో 15లక్షల కమతాలు ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 25 లక్షల కమతాలు నోషనల్‌ ఖాతాల సమస్యల్లో చిక్కుకున్నట్లు అంచనా.

వారసత్వ పత్రాలు లేకపోవడం, భాగ పంపకాల వివాదాలు

వారసత్వంగా భూములు పొందిన వారి వద్ద దస్త్రాలు లేకపోవడం, అన్నదమ్ముల మధ్య భాగ పంపకాలు పూర్తికాకపోవడం వంటి వివాదాలతో కొందరు పాసుపుస్తకాలు తీసుకోలేదు. ఇలాంటి భూములకు ఒక నోషనల్‌ సంఖ్య (ఉదాహరణకు 9500, 9800, 9999 లాంటివి) కేటాయించి... ‘ఇతరులు’ అనే పేరు పెట్టి, ఆన్‌లైన్‌(వెబ్‌ల్యాండ్‌)లోకి ఎక్కించారు. విజయనగరం జిల్లాలో ఒక్కో రైతుకు ఒక్కో నోషనల్‌ సంఖ్య ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో డస్ట్‌ అనే పేరు కనసిస్తోంది. గుంటూరు జిల్లా క్రోసూరులో 9500 అనే నోషనల్‌ ఖాతా కింద ఏకంగా 635 సబ్‌ డివిజన్లకు సంబంధించిన 876 ఎకరాల భూములు ఉండటం గమనార్హం.

land issues
నోషనల్​ ఖాతాల వివరాలు..

ఎక్కువ, తక్కువలుగా నమోదు

ఒక సర్వే నంబరులో అయిదుగురు రైతులకు తలో రెండెకరాల చొప్పున 10 ఎకరాల భూమి ఉంటే... అందులో ముగ్గురి పేరిట ఏడు ఎకరాలకు పొరపాటునో.. కావాలనో ఆన్‌లైన్‌లో నమోదై ఉంటుంది. మిగిలిన ఇద్దరికి నాలుగు ఎకరాల భూమి ఉన్నా... అందులో మూడు ఎకరాలు మాత్రమే ఎక్కించేందుకు వీలుంటుంది. నిజానికి ఆయా రైతుల వద్ద సంబంధిత దస్త్రాలున్నా.. ఆన్‌లైన్‌ చేయడానికి వీలు కుదరడం లేదు.
* దశాబ్దాల కిందట.. ఒప్పంద పత్రాలపై (సాదాబైనామా) భూముల్ని కొనుగోలు చేశారు. తరాలు గడిచాయి. భూములను వారి వారసులే అనుభవిస్తున్నా.. రిజిస్ట్రేషన్‌ మాత్రం చేయించుకోలేదు. దీనికి అవసరమైన పత్రాలు వారి వద్ద లేకపోవడమూ దీనికి ఒక కారణం.. ఇలాంటి వాటినీ నోషనల్‌ ఖాతాలోకి చేర్చారు.

2017లోనే చెప్పినా..

నోషనల్‌ ఖాతాల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూశాఖ 2017లోనే జిల్లా అధికారులకు సూచించింది. మ్యుటేషన్‌తోపాటు అడంగల్‌లో సరిదిద్దడం ద్వారా నోషనల్‌ ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్చాలని సూచించినా స్పందన లేదు.

నిర్దిష్ట సమయం కేటాయిస్తేనే..

భూముల సమగ్ర రీసర్వే పైనే ఈ సమస్య ఎదుర్కొంటున్న రైతులు ఆశలు పెట్టుకున్నారు. అలాగే ఈ సమస్యను సరిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించాలని ఇటీవల రెవెన్యూ శాఖ కోరడం కూడా వారికి ఊరట నిస్తోంది. అయితే ఈ సమస్యల పరిష్కారానికి చాలా సమయం పడుతుందని రెవెన్యూవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఉన్న అడ్డంకులను అధిగమించి సమస్యలకు పరిష్కారం చూపకలిగితేనే రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

ఉదంతం:1
నెల్లూరు జిల్లా జలదంకి గ్రామానికి చెందిన మాల్యాద్రికి 48 సెంట్ల భూమి ఉంది. అది 12345 నోషనల్‌ ఖాతాలో చేరింది. ఆయనకు ఒకటి రెండుసార్లు పీఎం కిసాన్‌ సొమ్ములు కూడా పడ్డాయి. తర్వాత ఆగిపోయాయి. ఎందుకు రావడం లేదని ఆరా తీస్తే నోషనల్‌ ఖాతాలో ఉందని చెప్పారు. ‘భూమి నా స్వాధీనంలోనే ఉంది. ఈ ఏడాది 15 బస్తాలు వడ్లు కూడా అయ్యాయి. అయినా పాసుపుస్తకం మాత్రం ఇవ్వడం లేదు, నోషనల్‌ ఖాతా మార్చడం లేదు’ అని ఆవేదన వెలిబుచ్చారు.
ఉదంతం:2
విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన అప్పన్న.. నోషనల్‌ ఖాతాతో పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. దీంతో బ్యాంకు రుణాలూ రావడం లేదు అనేది ఆయన ఆవేదన. పట్టాదారు పాసుపుస్తకంలో ఆయన పేరుతో కన్పిస్తున్న భూమి.. వెబ్‌ల్యాండ్‌లో మాత్రం భార్యపేరుతో ఉంది. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని ఆయన వాపోతున్నారు.

అసలేమిటీ ఖాతాలు
భూములపై యాజమాన్య హక్కులను పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తారు. రైతు వారీగా ఖాతా తెరిచి, ఆ గ్రామంలో ఆయనకున్న భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా నమోదు చేస్తారు. ఏమైనా విక్రయిస్తే... ఆ విస్తీర్ణాన్ని తొలగిస్తారు. కొన్నవారికి శాశ్వత పట్టా సంఖ్య కేటాయించి పాసుపుస్తకం ఇస్తారు.
ప్రభుత్వ భూములకు పాసుపుస్తకాలు ఉండవు. వీటిని నోషనల్‌ ఖాతాలో నమోదు చేస్తారు. డొంకలు, పోరంబోకు, గయాళు, తరం కట్టని గయాళు, చెరువు, కాలువలు, వాగులు, కాలిబాటలు, రహదారులు, రైల్వే భూములు, ప్రభుత్వ విద్యాసంస్థలు, శ్మశానాలు, బందెలదొడ్లు భూములన్నీ వర్గీకరణల వారీగా పొందుపరుస్తారు.
రైతుల పేర్లు, హక్కు పత్రాలు లేని పట్టా భూములు, సమస్యల్లో ఉన్న వాటికి నోషనల్‌ ఖాతా సృష్టించి అందులో వేశారు. ఇవన్నీ తాత్కాలికమైనవే. రైతుల వద్ద ఆధారాలను పరిశీలించి యాజమాన్య హక్కులు, శాశ్వత పట్టా సంఖ్యలు కేటాయించి... నోషనల్‌ ఖాతాల నుంచి వాటిని తొలగించాలి. ఈ ప్రక్రియ సాగడం లేదు.

ఇదీ చదవండి: నంద్యాల చెక్‌పోస్ట్‌ వద్ద భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.