కరోనా బారిన పడకుండా ఉండడం కోసం మహిళా ఇన్‌స్పెక్టర్ హెర్బల్ టీ తయారు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని లేక్ పోలీస్‌స్టేషన్ సీఐ ధనలక్ష్మీ కరోనా జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
హెర్బల్ టీ తయారు చేసి ప్రజలు ఆరోగ్యం పట్ల ఏ విధమైన శ్రద్ద తీసుకోవాలో చెప్పారు. ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించిన విధంగా దీనిని తయారు చేసినట్లు ఆమె తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పులు రావని... ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇది ఉపయోగించాలని తయారీ విధానాన్ని ధనలక్ష్మీ వివరించారు.
ఇదీ చూడండి: వెచ్చటి నీళ్లు తాగితే... కరోనా పోతుందా?