ETV Bharat / city

ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో కిలేడి వలపు వల.. ఆ తర్వాత నగ్న వీడియోలతో బెదిరిస్తూ.. - ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో కిలేడి వలపు వల

Khiladi Lady Cheating: ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ముందుగా మేసేజ్​లతో ముగ్గులోకి దించుతారు. ఆ తర్వాత పర్సనల్ వివరాలు అడుగుతారు. చెప్పామంటే అంతే ఇక... నగ్నంగా వీడియో కాల్స్ చేస్తారు. టెంప్ట్​ అయి ముందడుగు వేస్తే.. ఏం జరుగుతుందో చూడండి..

Khiladi Lady
ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీతో కిలేడి
author img

By

Published : Sep 23, 2022, 5:01 PM IST

Khiladi Lady Cheating: సామాజిక మాధ్యమాల వినియోగం పెరగటంతో అదే స్థాయిలో సైబర్‌ నేరాలూ పెరిగిపోతున్నాయి. కొందరు మాయలేడీలు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం పేరిట తీయని మాటలతో అబ్బాయిలను వలలో వేసుకొని నగ్నంగా వీడియో చాటింగ్‌ ఉచ్చులోకి దింపుతున్నారు. ఆ తరువాత తాము డిమాండ్‌ చేసిన డబ్బులు ఇవ్వకపోతే అబ్బాయికి సంబంధించిన నగ్న చిత్రాలను, వీడియోలను ఇంటర్నెట్‌, యూట్యూబ్‌ల్లో పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. హైదరాబాద్​ గచ్చిబౌలి ఠాణా పరిధిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.

ఇన్‌స్పెక్టర్‌ గోనె సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలో ఓ ప్రైవేటు బ్యాంక్‌లో పనిచేస్తున్న యువకుడు(26)కి నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఐడీ పేరిట ఉన్న యువతితో పరిచయం ఏర్పడింది. స్నేహం పేరిట మొదట ఇద్దరి మధ్య సంభాషణ సాగింది. ఫోన్‌ నంబర్లు పంచుకొని చాటింగ్‌ మొదలు పెట్టారు. తరువాత రెండు రోజులు వాట్సప్‌ వీడియోకాల్‌లో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మాయలేడీ నగ్నంగా వీడియో కాల్స్‌ చేసింది. తానేం తక్కువ కాదంటూ అతనూ రెచ్చిపోయాడు.

ఈ క్రమంలోనే ఆమె ఉచ్చులో పడ్డాడు. అతని వీడియోలను, చిత్రాలను సేకరించిన ఆమె వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరింపులకు దిగింది. రూ.5 వేలు, రూ.10వేలు పంపాలంటూ సందేశాలు పంపిస్తోంది. విసిగిపోయిన బాధితుడు గురువారం గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.