ETV Bharat / city

మంత్రి కేటీఆర్ కొత్త నిర్వచనం.. 'భాజపా అంటే బక్వాస్ జుమ్లా పార్టీ' - కేటీఆర్ పొలిటికల్ ట్వీట్

Ktr Tweet on Amit shah visit: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి దిల్లీ భాజపా నేతలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై పొలిటికల్ టూరిస్ట్​ అంటూ ఎద్దేవా చేశారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ అంటూ ట్విటర్​ వేదికగా విమర్శలు చేశారు.

Ktr Tweet on Amit shah visit
Ktr Tweet on Amit shah visit
author img

By

Published : May 14, 2022, 11:35 PM IST

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్ననే ఒక టూరిస్ట్ వచ్చి వెళ్లాడు.. ఇవాళ మరో టూరిస్ట్ వచ్చాడంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొలిటికల్ టూరిస్టుల సీజన్​ నడుస్తోందని ఎద్దేవా చేశారు. 'వచ్చాడు.. తిన్నాడు.. తాగాడు.. వెళ్లాడు..' అంటూ అమిత్​ షాను ఉద్దేశించి కేటీఆర్​ ట్విటర్​లో సైటైర్ వేశారు. భాజపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు ఏమి ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికీ కూడా అదే తంతు కొనసాగుతోందన్నారు. భాజపా అంటే 'బక్వాస్ జుమ్లా పార్టీ' అని తీవ్రంగా విమర్శించారు.

  • Season of political tourism continues;

    Ek Aur Tourist Aaj; Aaya, Khaya, Piya, Chal Diya 😁

    8 Saal Mein Kuch Nahi Diya Telangana Ko, Aaj Bhi Wahi Silsila

    Wahi Jhumlabaazi Aur Dhokebaazi
    Living up to its name

    B - Bakwaas
    J - Jhumla
    P - Party

    — KTR (@KTRTRS) May 14, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి - హరీశ్ రావు: కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటనపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సెటైరికల్‌గా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘వలస పక్షులు వస్తుంటాయి.. పోతుంటాయి. ఇష్టమైన ప్రదేశాలు, ఆహారం ఆస్వాదించి సంతోషంగా వెళ్తాయి. ఇవాళ ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం యాదృచ్ఛికం’’ అని హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు #AmitShahVisitsTelangana, #WorldMigratoryBirdDay హ్యాష్‌ ట్యాగ్‌లతో పాటు పక్షులు ఎగురుతూ వెళ్తున్న ఫొటోను ఆయన పోస్టు చేశారు.

ఇవీ చూడండి: 'తెలంగాణలో నిజాం ప్రభువును గద్దె దించేందుకు సిద్ధమవ్వండి..'

"జనగణమనలో 'సింధ్'​ను తొలగించండి.. పాక్​ను కీర్తిస్తూ పాడేదెలా?"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.