ETV Bharat / city

కొత్త కార్పొరేటర్లతో నేడు కేటీఆర్​ భేటీ - ktr meeting with party leaders

కొత్తగా ఎన్నికైన పార్టీ కార్పొరేటర్లతో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఇవాళ సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ ఇందుకు వేదిక కానుంది. ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎలా మెలగాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బల్దియా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెరాసలో... మేయర్, ఉపమేయర్ పదవుల కోసం తీవ్ర పోటీ నెలకొంది.

ktr-meeting-today-with-new-corporators-in-telangana-bhavan
కొత్త కార్పొరేటర్లతో నేడు కేటీఆర్​ భేటీ
author img

By

Published : Dec 6, 2020, 12:18 PM IST

కొత్తగా ఎన్నికైన తెరాస కార్పొరేటర్లకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఇవాళ అభినందన సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో భేటీ కానున్నారు. ప్రజాప్రతినిధులుగా రానున్న ఐదేళ్ల పాటు ప్రజలతో ఎలామెలగాలో దిశానిర్దేశం చేయనున్నారు.

సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ తెరాస ఎమ్మెల్యేలూ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తెరాస ఎక్స్‌అఫీషియో ఓట్లతో మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మేయర్ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ కాగా.... తెరాస తరఫున కార్పొరేటర్లుగా ఎన్నికైన 27 మంది మహిళల్లో ప్రధానంగా ఏడెనిమిదిమంది రేసులో ఉన్నారు.

మేయర్​ ఎవరు..

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని భారతీనగర్ డివిజన్​లో గెలిచిన సింధురెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. సింధురెడ్డి.. ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డి కోడలు కావడం ఆమెకు కలిసి వస్తుందనే ప్రచారం వినిపిస్తోంది. ఖైరతాబాద్ కార్పొరేటర్, మాజీ మంత్రి పీజేఆర్​ కుమార్తె విజయరెడ్డి, చర్లపల్లి నుంచి ఎన్నికైన ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి, బంజారాహిల్స్ నుంచి మరోసారి కార్పొరేటర్‌గా గెలుపొందిన తెరాస సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె విజయలక్ష్మి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అల్వాల్ నుంచి మరోసారి గెలిచిన దివంగత ఎమ్మెల్యే కనకా రెడ్డి కోడలు చింతల విజయశాంతి కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. తార్నాక నుంచి విజయం సాధించిన సీనియర్​ నేత మోతె శోభన్​రెడ్డి.. భార్య మోతె శ్రీలత, వెంకటేశ్వర కాలనీ కార్పొరేటర్‌గా ఎన్నికైన మన్నె కవిత పేర్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి.

డిప్యూటీ మేయర్.. మైనారిటీ లేదా బీసీ, ఎస్సీ, ఎస్సీ వర్గాలకు చెందిన పురుషుడికి ఇచ్చే అవకాశం ఉంది. ఆ పదవి కోసం తెరాసలో తీవ్ర పోటీ నెలకొంది.

ఇవీచూడండి:

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో 'అప్పుల వాటా'యే ఎక్కువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.