ETV Bharat / city

నాపై కేటీఆర్‌ ఒత్తిడి చేస్తున్నారు: హరీశ్‌ - cfos meet hyderabad latest news

పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు త్వరగా విడుదల చేయాలంటూ... తనపై ఒత్తిడి చేస్తున్నారని హరీశ్​రావు సరదాగా వ్యాఖ్యానించారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు హరీశ్​రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ktr-is-putting-pressure-on-me-says-harish-rao-in-cii-meet
సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు
author img

By

Published : Dec 5, 2019, 7:15 PM IST

సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్​లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎఫ్​వో-2019 సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎఫ్​వో పాత్ర మానవ శరీరంలో గుండె కాయ లాంటిదని మంత్రి హరీశ్​ అభివర్ణించారు.

సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

కేటీఆర్​ బాగా పనిచేస్తున్నారు..

సరళతర వాణిజ్య విధానంలో ఏటా తొలి వరుసలో నిలుస్తున్నామని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తూ... మంచి ఫలితాలు సాధిస్తున్నారని హరీశ్​రావు ప్రశంసించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు త్వరగా విడుదల చేయాలంటూ... కేటీఆర్ తనపై ఒత్తిడి చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు.

ఆర్థిక రంగం మెరుగుపడేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. సీఎంతో మాట్లాడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వీలైనంత త్వరగా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

ఇవీచూడండి: వడ్డీ రేట్లు యథాతథం- ఆర్బీఐ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.