అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న వైకాపా నేతలు దగ్గరుండి బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. "జగన్ రెడ్డి తన సొంత బ్రాండ్లతో మద్యం మాఫియాకు తెరతీశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై లిక్కర్ మాఫియా ద్వారా కోట్లు దండుకుంటూ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. విశాఖ మద్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు చేసి అసలు దోషులను కఠినంగా శిక్షించాలి. కేంద్ర పెద్దలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సమయం ఇవ్వకపోవటం సిగ్గుచేటు. రెండేళ్లలో దోచుకోవటమే పనిగా వైకాపా పాలన సాగింది. కమీషన్ల కోసం ఇసుక రీచ్‌లను ప్రైవేటు సంస్థకు ధారాదత్తం చేశారు. ఇసుక మాఫియా వల్ల వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోగా అనేకమంది ఆత్మహత్య చేసుకున్నారు" అని విమర్శించారు.
ఇదీ చదవండి: