ETV Bharat / city

కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ - నందమూరి బాలకృష్ణ వార్తలు

దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాద్​రావు జయంతిని హైదరాబాద్​లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో నిర్వహించారు. కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. ఆసుపత్రికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.

kodela services memorable: Bala krishna
kodela services memorable: Bala krishna
author img

By

Published : May 2, 2020, 7:04 PM IST

కోడెల సేవలు చిరస్మరణీయం: బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి అభివృద్ధికి కోడెల శివప్రసాద్‌రావు ఎంతో కృషి చేశారని... ఆసుపత్రి ఛైర్మన్‌, సినీ హీరో బాలకృష్ణ గుర్తుచేశారు. ఆసుపత్రిని దేశంలోనే అత్యున్నతస్థాయి క్యాన్సర్‌ చికిత్సా కేంద్రంగా మలచడంలో కోడెలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఆసుపత్రి అభివృద్ధికి కోడెల సేవలు చిరస్మరణీయమని అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రిలో దివంగత నేత డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ జయంతి నిర్వహించారు.‌ బాలకృష్ణతో పాటు ట్రస్ట్‌ సభ్యులు, వైద్య సిబ్బంది కోడెల చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి

బాలీవుడ్​​ దర్శకుడితో తారక్ పీరియాడికల్​ సినిమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.