ETV Bharat / city

'అర్హులకు అయిదు రోజుల్లో బియ్యం కార్డులు' - Ration-cards news

కొత్తగా తీసుకొచ్చిన బియ్యం కార్డులతో.. నాణ్యమైన బియ్యాన్ని అర్హులందరికీ అందిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు. వైఎస్సార్ నవశకం సర్వేతో చౌకధరల దుకాణాల్లో బియ్యం తీసుకోని 10 లక్షల మందిని గుర్తించామన్నారు. కార్డులు తొలగించిన వారిలో 2.5 లక్షల మంది పునఃపరిశీలన అభ్యంతరాలు పెట్టుకున్నారని తెలిపారు.

kodali nani
కొడాలి నాని
author img

By

Published : Feb 8, 2020, 8:30 PM IST

తెల్లరేషన్​ కార్డులు మరుగున పడిపోయిన అంశమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. ఇక చౌకదుకాణాల్లో బియ్యం తీసుకునేందుకు బియ్యం కార్డులు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. చౌకధరల దుకాణాల నుంచి బియ్యం తీసుకునేందుకు ఈ విధానం మెరుగైందని మంత్రి అన్నారు. నాణ్యమైన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి.. బియ్యం కార్డుల ద్వారా అర్హులకు అందిస్తామన్నారు. నూతనంగా ప్రారంభించిన ఈ బియ్యం కార్డులతో ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్​మెంట్ పథకాలేవీ ముడిపడిలేవని పేర్కొన్నారు.

అభ్యంతరాలు పునః పరిశీలన

వైఎస్సార్ నవశకం ద్వారా గ్రామ, వార్డు వాలంటీర్లు బియ్యం కార్డుల అర్హులను గుర్తించారని మంత్రి తెలిపారు. మొత్తం కోటీ 47 లక్షల 23 వేల 567 రేషన్ కార్డుల్లో 10 లక్షల మంది చౌకధరల దుకాణాల నుంచి బియ్యాన్ని తీసుకోవడం లేదని తెలిపారు. మరికొందరిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తించిందన్నారు. మొత్తం 2.5 లక్షల మంది నుంచి పునః పరిశీలన కోసం అభ్యంతరాలను స్వీకరించామన్న మంత్రి.. పరిశీలన తర్వాత అర్హులైన వారికి కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

అర్హులు-అనర్హులు

గ్రామ, వార్డు సచివాలయాలకు నిర్దేశించిన 541 పౌరసేవల్లో బియ్యం కార్డు అందించటం కూడా ఒకటని మంత్రి వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న అయిదు రోజుల్లో అర్హులకు కార్డు మంజూరు అవుతుందని.. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. గ్రామాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేల నెలవారీ ఆదాయంలోపు ఉంటే బియ్యం కార్డుకు అర్హులేన్న మంత్రి.. 300 యూనిట్ల విద్యుత్ వినియోగం దాటిన వారు అనర్హులు అవుతారని స్పష్టం చేశారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం కార్డు మంజూరు చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:

'ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.