ETV Bharat / city

Kodali Nani: రైతులకు ధాన్యం బకాయిలు రూ.3,393 కోట్లు.. నెలాఖరులోగా చెల్లింపులు - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

రాష్ట్రంలో రైతులకు ధాన్యం బకాయిలు రూ.3,393 కోట్లు ఉన్నాయని మంత్రి కొడాలి నాని తెలిపారు. 21 రోజులు దాటాక రూ.1,204 కోట్లు ఇవ్వాల్సినవి ఉన్నాయన్నారు. నెలాఖరులోగా రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు చెల్లిస్తామని తెలిపారు.

kodali nani
kodali nani
author img

By

Published : Jul 19, 2021, 9:08 AM IST

ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రతి పైసా నెలాఖరులోగా రైతులకు చెల్లిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. రైతులకు రూ.3,393 కోట్లు బకాయి ఉందని.. ఇందులో 21 రోజులు దాటాక ఇవ్వాల్సినవి రూ.1,204 కోట్లు అని తెలిపారు. మంగళ, బుధవారాల్లో రూ.1,600 కోట్లు రుణంగా ఇస్తామని నాబార్డు అధికారులు చెప్పారని.. వీటిని వెంటనే రైతులకు ఇస్తామని చెప్పారు.

కేంద్రం నుంచి ఇంకా రూ.5,056 కోట్లు రావాల్సి ఉందని, వీటిలో ఈ నెల 25న రూ.1,600 కోట్లు విడుదల చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని వివరించారు. నాబార్డు రుణం, కేంద్రం ఇచ్చే వాటితో రైతులకు చెల్లింపులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకూ రైతులకు రూ.3400 కోట్లు చెల్లించామని వివరించారు. ఆదివారం తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో మంత్రి విలేకర్లతో మాట్లాడారు.

ఇల్లు కట్టించడంపై విచారణ చేయించొచ్చు

‘మంత్రికి ఓ ఉన్నతాధికారి ఇల్లు కట్టించారనే విషయమై ఎంపీ జీవీఎల్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వానికి ఆధారాలు ఇస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. లేకపోతే కేంద్రంతో విచారణ చేయించొచ్చు. పౌరసరఫరాల శాఖను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నడిపిస్తాయి. కేంద్రం ఎప్పుడైనా వచ్చి విచారణ చేసి చర్య తీసుకోవచ్చు’ అన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం బాగుందా.. దివాలా తీసిందా? ఖజానాలో డబ్బులున్నాయా అనేది ముఖ్యం కాదు. ప్రజల ఆర్థిక స్థోమత గురించి ఆలోచించాలి. ప్రజలు బాగున్నారా.. లేదా? వారు తింటున్నారా.. లేదా? వారికి ఏం చేయాలో ఆలోచించాల్సింది పోయి.. కాకి లెక్కలు, అబద్ధాలు చెప్పాలని చూస్తే తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో చూశారు. దిల్లీ నుంచి వారానికోసారి వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం లేదు’ అని భాజపా నేతలపై ధ్వజమెత్తారు.

తెదేపాను భాజపాలో విలీనం చేయాలని చూస్తున్నారు

‘జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్‌ వారసుడు. కార్పొరేషన్‌ పదవుల్లో ప్రతిచోటా మహిళలకు న్యాయం చేస్తున్నారు. చంద్రబాబునాయుడు తెదేపాను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు మాట్లాడుకుంటున్నారని తెలుసు. వచ్చే ఎన్నికల్లో భాజపా- జనసేన తెదేపాతో కలిసి రావు. అందుకే తెదేపాను భాజపాలో విలీనం చేయాలని చూస్తున్నారు’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.

ఇదీ చదవండి:

నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.