ETV Bharat / city

తెలంగాణలోకి కరోనా రానివ్వం: కేసీఆర్​ - కరోనాపై కేసీఆర్​ వ్యాఖ్యలు

తెలంగాణలో కరోనా లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. వైరస్​ లేనప్పుడు మాస్కులు ఎందుకని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రానికి కరోనా రాదని... మేము రానివ్వమని ముఖ్యమంత్రి చెప్పారు. వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించైనా కరోనాను అడ్డుకుంటామన్నారు.

తెలంగాణలోకి కరోనా రానివ్వం
తెలంగాణలోకి కరోనా రానివ్వం
author img

By

Published : Mar 7, 2020, 5:27 PM IST

కరోనాపై అసెంబ్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్​ ప్రకటన

కరోనా వైరస్​పై అసత్య ప్రచారం చేయొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కరోనా వైరస్​పై స్పందించారు. రాష్ట్రంలో కరోనా లేదని... వైరస్​ లేనప్పుడు ఇక మాస్కుల పంపిణీ ఎందుకని ప్రశ్నించారు. దేశంలో 130 కోట్ల జనాభాకి కరోనా కేసులు 31 మాత్రమే నమోదయ్యాయని తెలిపారు.

రాష్ట్రానికి కరోనా వైరస్‌ రాదు... మేము రానివ్వమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఒక వేళ ఈ వైరస్ వస్తే.. మాస్క్‌లు లేకుండానే పనిచేస్తామని వెల్లడించారు. కరోనా వస్తే చిన్న పారాసెటిమాల్‌ వేస్తే చాలని తనకో శాస్త్రవేత్త ఫోన్‌ చేసి తెలిపారని ముఖ్యమంత్రి వివరించారు. 22 డిగ్రీలు ఉష్ణోగ్రత దాటితే కరోనా వైరస్‌ బతకదని... రాష్ట్రంలో ఇప్పటికే ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటిందని... ఇక కరోనా బతికే అవకాశం ఎక్కడిదని సీఎం ప్రశ్నించారు.

ఇదీ చూడండి:

'మాన్సస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు సరికాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.