దేశం కోసం వీరమరణం పొందిన తెలంగాణ వాసి కర్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం ఇవ్వడం సంతోషమే అయినా.. పరమ వీర చక్ర పురస్కారం ఇస్తే బాగుండేదని ఆయన తండ్రి బికుమల్ల ఉపేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తన కుమారుడి వీరమరణం పట్ల గర్విస్తున్నాని చెప్పారు. ఆయుధాలు లేకుండా శత్రు మూకలను తరిమికొట్టిన సంతోష్‌కు పరమవీర చక్ర పురస్కారం దక్కితే న్యాయంగా ఉండేదన్నారు. గల్వాన్ పోరు అనంతరం భారత్ శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు.
కర్నల్ సంతోష్ భార్య సంతోషి.. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ట్రైనీ డిప్యుటీ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. నిన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో ట్రైనీ కలెక్టర్ హోదాలో పాల్గొన్నారు.