వైకాపా అసమర్థ పాలనతో.. రాష్ట్రం కరోనా కోరల్లో చిక్కుకుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు ఆరోపించారు. రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలలో కేసులు తగ్గుతున్నా ఏపీలో మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ని కరోనాంధ్రప్రదేశ్‌గా మార్చారని దుయ్యబట్టారు. డ్యూహెచ్వో చెప్పినా వినకుండా విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్న ఆయన.. యాక్టివ్ కేసులతో దేశంలోనే 2వ స్థానంలో ఉందని విమర్శించారు. 3 రాజధానులు, మూర్ఖపు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ.. కరోనా నివారణపై లేదా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: మౌలిక సదుపాయాల నిధితో రైతు కష్టాలు తీరేనా?