tdp leaders on Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. సీఎం సొంత కుటుంబంలో హత్య జరిగితే స్పందించటం లేదని విమర్శించారు. ఎంపీ అవినాష్ రెడ్డిపై ప్రమేయం ఉందని సీబీఐ చెప్పినా.. సీఎం జగన్ నోరు విప్పకపోవడం అనుమానులకు తావిస్తోందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆరోపించారు.
పెరిగిన కరెంటు ఛార్జీలు, భూ కబ్జాలు వంటి వాటిపై సమావేశంలో తీర్మానం చేశారు. జిల్లాలో ఖనిజ సంపదను వైకాపా నేతలు దోచుకోవడాన్ని నిరసిస్తూ ఈనెల 28న కలెక్టరేట్ ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని జిల్లా సమన్వయ సమావేశంలో నేతలు తీర్మానించారు. వివేకా హత్య కేసుపై గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రమేయం ఉందని సాక్షి మీడియాలో వార్తలు రాయించిన ఆ పార్టీ నేతలు... ఇపుడు వైకాపా నేతలే హత్య చేశారన్న విధంగా సీబీఐ దర్యాప్తు సాగుతుంటే నోరు మెదపడం లేదని ఆక్షేపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి తన బాబాయ్ హత్య కేసు విషయంలో నిజాలు చెప్పాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి