రాష్ట్రంలో ప్రాజెక్టులు, టెండర్ల సమీక్ష కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ప్రివ్యూగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర్ రావు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయం రెండో బ్లాకులో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పనా రంగంలో 100 కోట్లు దాటే టెండర్ల సమీక్ష కోసం ప్రభుత్వం ఈ నియామకాన్ని చేసింది. టెండర్లు, ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం చేశారనీ.. చట్ట ప్రకారం విధులు నిర్వర్తించడానికి ఓ న్యాయమూర్తిని నియమించడం ఇదే తొలిసారి అని జస్టిస్ శివశంకర్ వ్యాఖ్యానించారు. విదేశాల్లోనూ ఈ తరహా విధానం ఎక్కడా లేదన్నారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తన వంతు ప్రయత్నం చేస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..