ETV Bharat / city

పాత క్లస్టర్లలోనే ఎక్కువ కరోనా కేసులు: జవహర్​ రెడ్డి

నాలుగు జిల్లాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. కొత్తగా 7 మండలాలు రెడ్‌జోన్‌ పరిధి కిందకు వచ్చాయని తెలిపారు. ఎక్కువమందికి పరీక్షలు చేస్తున్న మొదటి 5 రాష్ట్రాల్లో ఏపీ ఉందన్నారు.

jawahar reddy on corona cases in andhra pradesh
కరోనా కేసులపై జవహర్​ రెడ్డి
author img

By

Published : Apr 24, 2020, 7:10 PM IST

పాత క్లస్టర్లలోనే ఎక్కువ కరోనా కేసులు వస్తున్నాయని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్నారు. సామర్లకోట, విజయవాడ సహా 8 చోట్ల కొత్త క్లస్టర్లు వచ్చాయన్నారు. కొత్తగా 7 మండలాలు రెడ్‌జోన్‌ పరిధి కిందకు వచ్చాయని తెలిపారు. నాలుగు జిల్లాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయి జవహర్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలో ఒక మిలియన్​ ప్రజలకు 1,018 పరీక్షలు చేస్తున్నామని జవహర్‌రెడ్డి అన్నారు. ఎక్కువమందికి పరీక్షలు చేస్తున్న మొదటి 5 రాష్ట్రాల్లో ఏపీ ఉందన్నారు. చిత్తూరు, గుంటూరు, కడప, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఎక్కువ పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు.

టెలీ మెడిసిన్‌ విధానానికి మంచి స్పందన వస్తోందని జవహర్‌రెడ్డి అన్నారు. ఈ విధానం కింద ఒక్క రోజులో 859 మందికి సేవలు అందినట్లు తెలిపారు. పరీక్షలో వరుసగా రెండుసార్లు నెగెటివ్ వస్తే కరోనా బాధితులను డిశ్చార్జ్ చేస్తున్నామని జవహర్​రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.