ETV Bharat / city

govt employees Salaries : ప్రభుత్వ ఉద్యోగులకు అనామతు ఖాతా నుంచి జీతాలు

govt employees Salaries : ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల జీతాలను అనామతు ఖాతా నుంచి చెల్లించారు. జీతాల పద్దు ఉండగా ఇలా అనామతు ఖాతాల ద్వారా రూ.వందల కోట్ల చెల్లింపులు చేయడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. రాష్ట్రంలో సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ వచ్చాక ఇలా అనామతు ఖాతాల ద్వారా చెల్లింపులు దాదాపు లేవని ఆర్థికశాఖలో గతంలో పనిచేసిన వారు చెబుతున్నారు.

govt employees Salaries :
govt employees Salaries :
author img

By

Published : Feb 22, 2022, 4:23 AM IST

employees Salaries paid from an anonymous account : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడూ లేని విధంగా జనవరి నెల జీతాలను అనామతు ఖాతా నుంచి చెల్లించారు. జీతాల హెడ్‌ ఆఫ్‌ అకౌంటు 010 పద్దు ఉండగానే అనామతు ఖాతా 8658 ద్వారా చెల్లింపులు సాగాయి. జీతాల పద్దు ఉండగా ఇలా అనామతు ఖాతాల ద్వారా రూ.వందల కోట్ల చెల్లింపులు చేయడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. సాధారణంగా దేనికీ చెందని, అనేక సందేహాలున్న మొత్తాలను అనామతు ఖాతాలో జమ చేస్తుంటారు. ఆనక వాటిని సర్దుబాటు చేస్తుంటారు. రాష్ట్రంలో సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ వచ్చాక ఇలా అనామతు ఖాతాల ద్వారా చెల్లింపులు దాదాపు లేవని ఆర్థికశాఖలో గతంలో పనిచేసిన వారు చెబుతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప అలా చెల్లింపులు చేయరని పేర్కొంటున్నారు.
అనామతు ఖాతాను పూర్తిగా నియంత్రించినందుకు ఏపీ ఆర్థికశాఖను అభినందిస్తూ గతంలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ అధికారులు లేఖ రాశారని తర్వాత కొద్ది రోజులకే చెల్లింపులు సాగాయని పేర్కొంటున్నారు.

ఏప్రిల్‌లో...:
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల మొదటి రెండు రోజుల్లోనే అనామతు ఖాతా నుంచి దాదాపు రూ.3,000 కోట్లను చెల్లించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజున బిల్లుల చెల్లింపులకు చివరి నిమిషంలో రిజర్వుబ్యాంకుకు వర్తమానం పంపారు. ఆ మేరకు చెల్లింపులు జరగలేదు. ఆరోజు అర్ధరాత్రితో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన బడ్జెట్‌ ప్రకారం చెల్లింపులకు మార్చి 31 ఆఖరు తేదీ. ఆ మర్నాడు చెల్లింపులకు వీల్లేదు. ఆర్‌బీఐ ఆరోజు ఆమోదించని మొత్తానికి, మరికొన్ని బిల్లుల చెల్లింపులకు ఆర్థికశాఖ అధికారులు అనామతు ఖాతా ఎంచుకున్నారు. మొదట ఆ మొత్తాలను అనామతు ఖాతాకు బదిలీ చేసి ఆ తర్వాత ఏప్రిల్‌ మొదటి వారంలో చెల్లింపులు జరిపారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రేగాయి. అనామతు ఖాతా ద్వారా చెల్లింపుల సమాచారం బయటపడిందని ఆర్థికశాఖ అధికారులు అప్పట్లో ఆందోళన చెందారు. అలాంటిది ఇప్పుడు జనవరి నెల జీతాలకు ఏకంగా రూ.వేల కోట్లు అనామతు ఖాతా ద్వారా చెల్లించడం చర్చనీయాంశమవుతోంది.

వేల మంది చేయాల్సిన పనిని...
* సాధారణంగా ఉద్యోగుల జీతాలకు రాష్ట్రంలోని డ్రాయింగ్‌ డిస్‌బర్సుమెంటు అధికారుల (డీడీవోలు) వద్ద బిల్లులు సిద్ధంచేసి వారు ఆమోదించాక ఖజానా అధికారులకు పంపి అక్కడ ఆమోదింపజేస్తారు. ఆ తర్వాతే సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* జనవరి జీతాల విషయంలో డీడీవోలు సహకరించక పోవడం, ఖజానాకు కొత్త జీతాల బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వం అనామతు ఖాతా ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని డీడీవోలంతా చేయాల్సిన పనిని ఖజానా శాఖ డైరెక్టర్‌ ఒక్కరికే అప్పచెప్పింది. ఖజానా అధికారులు చేయాల్సిన పనిని పే అండ్‌ అకౌంటు అధికారి ఒక్కరే చేసేలా ఉత్తర్వులు ఇచ్చింది.
* జీతాల పద్దు ద్వారా డీడీవోలు చెల్లింపులు చేయాల్సి ఉండగా అందుకు అవకాశం దక్కక పోవడంతో ఎంహెచ్‌ 8658 అనామతు ఖాతా ద్వారా లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించేశారు.
* ఇప్పుడా అనామతు చెల్లింపులను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు డీడీవోలంతా జనవరి జీతాల సర్దుబాటు బిల్లులు చేసి ఆమోదించాలి. జీతాల హెడ్‌ నుంచి డెబిట్‌ చేసి సస్పెన్స్‌ హెడ్‌కు క్రెడిట్‌ చేయాల్సి ఉంటుంది. డీడీవోలు ఆ సర్దుబాటు బిల్లులు ఖజానా అధికారులకూ పంపితే వారు ఈ అనామతు ఖాతా బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది.

ఒకరోజు గడిచినా..
2022 సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం డీడీవోలు వేతన స్థిరీకరణ నిర్వహించాలి. పైన పేర్కొన్న సర్దుబాటుతోపాటు ప్రతి ఉద్యోగికీ ఇవ్వాల్సినవి, మినహాయించాల్సినవి సరిచేసి ఫిబ్రవరి జీతాల బిల్లులు సిద్ధం చేయాలి. ఈ పని అంతా 5 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశాలిచ్చారు. డీడీవోలు పని చేసేందుకు అనువుగా సంబంధిత హెర్బ్‌ పే రోల్‌ మాడ్యూల్‌ సోమవారం సాయంత్రానికీ చాలామందికి అందుబాటులోకి రాలేదని తెలిసింది. మిగిలిన నాలుగు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనా అని కొందరు డీడీవోలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి : సరిహద్దుల్లో మౌలిక వసతులకు రూ.13వేల కోట్లు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.