ETV Bharat / city

రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీయం: పవన్​ కల్యాణ్​ - janasena president pawan kalyan comments on amaravathi farmers protest news

రాజధాని మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏకపక్షమేనని జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​ విమర్శించారు. రాజధాని రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికి తప్ప.. ఏ పార్టీకో, వ్యక్తులకో కాదన్న ఆయన.. అప్పటి ప్రభుత్వం చేసిన ఒప్పందాలను ప్రస్తుత పాలకులు గౌరవించాలని అన్నారు. రాజధాని రైతుల త్యాగాలను వృథా కానీయమని.. అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తామని జనసేనాని స్పష్టం చేశారు.

రాజధాని రైతుల త్యాగాలు వృథా కానీయం: పవన్​ కల్యాణ్​

author img

By

Published : Jul 6, 2020, 12:58 PM IST

pawan kalyan
పవన్​ కల్యాణ్​ బహిరంగ లేఖ

అమరావతి రైతుల త్యాగాలు వృథాకానీయబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చెప్పారు. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు బాసటగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతి మార్పుపై ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమేనని పవన్​ అన్నారు. రాజధానిని 3 ముక్కలు చేస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ కాదని పేర్కొన్నారు. రాజధానిని పరిరక్షించుకొనేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని.... వారికి జనసేన సంఘీభావం తెలుపుతుందన్నారు.

ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని... తర్వాత వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికే కానీ.. ఒక వ్యక్తికో, పార్టీకో కాదన్నారు. రాష్ట్రంలో అన్ని ‌ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న... పవన్ కల్యాణ్‌... రాజధానిని తరలింపు నిర్ణయం సరికాదని అన్నారు.

అమరావతి రైతులకు ఇవ్వాల్సిన కౌలుపై నిర్లక్ష్యం తగదని.. ‌ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం కౌలు నిధులు విడుదల చేయడం లేదని పవన్​ ఆరోపించారు. ఏప్రిల్​ కౌలు ఇప్పటికీ ఇవ్వకపోవడం రైతులను వేదనకు గురి చేయడమేనని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి..

'మీరిచ్చే స్థలాల్లో ఇళ్లు కట్టుకునే అవకాశం ఉందా..?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.