తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శిస్తుంటే వైకాపా నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించటంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా నేతల చర్యను హేయమైన చర్యగా అభివర్ణించారు. సీఎం జగన్ ది ఐరన్ లెగ్ అని... అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కరవు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు వెంటాడుతున్నాయని అన్నారు. వైకాపా పాలనలో అన్నదాతలు, కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రైతులపై చిత్తుశుద్ధి ఉంటే తక్షణమే పదివేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి