ఈఎస్ఐ కుంభకోణంలో టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టులో నిబంధనలు లోపించినట్లు కనిపిస్తున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న ఆయన.. అసెంబ్లీ సమావేశాలకు ముందు అచ్చెన్నాయుడి అరెస్టు సందేహాలకు తావిస్తోందని పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడిని.. అవినీతికి పాల్పడినందుకా.. లేక రాజకీయ కక్ష సాధింపు కోసం అరెస్టు చేశారా అనేది తేల్చాలని నాదెండ్ల ప్రశ్నించారు. ఎమ్మెల్యే అరెస్టుకు ముందు రాజ్యాంగ నిబంధనలు పాటించాలని సూచించారు. అన్ని అక్రమాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని నాదెండ్ల డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి..