వెనకబడిన తరగతుల వారి హక్కుల కోసం ఉద్యమించే సమయంలో అంతా ఏకమవుతున్నారనీ, ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు (pawan kalyan on bc movement news). బీసీల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2024 ఎన్నికల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈనెల 23వ తేదీన హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించే జాతీయ స్థాయి సదస్సుకు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి కులగణన, రిజర్వేషన్ల కల్పనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్((pawan kalyan news) మాట్లాడుతూ.. బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావవ్యాప్తికి తాను కట్టుబడి ఉన్నానన్నారు. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆ కులాలకు స్వయం ప్రతిపత్తి, రాజ్యాధికారం తీసుకురావాలన్నదే తన ఆకాంక్షగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం భావవ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని అభిలాషించారు. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నా అసలు సమయానికి ఆచరణకు నోచుకోవడం లేదని.. అందుకు రాజకీయపరమైన అవగాహన అవసరమన్నారు. ఇందుకు తగిన మథనం జరగాలన్నారు. యువతకు నాయకత్వాన్ని అప్పగించాలని.. రాజకీయంగా ముందుకు వెళ్లాలని.. బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడుతానని పవన్‌కల్యాణ్ అన్నారు.
-
ఉద్యమాలతో పాటు ఎన్నికల సమయంలోనూ బీసీలు ఏకం కావాలి : జనసేనాని శ్రీ @PawanKalyan గారు#JanaSenaTelangana @JanaSenaParty pic.twitter.com/VVLQBx0CaF
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) October 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఉద్యమాలతో పాటు ఎన్నికల సమయంలోనూ బీసీలు ఏకం కావాలి : జనసేనాని శ్రీ @PawanKalyan గారు#JanaSenaTelangana @JanaSenaParty pic.twitter.com/VVLQBx0CaF
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) October 12, 2021ఉద్యమాలతో పాటు ఎన్నికల సమయంలోనూ బీసీలు ఏకం కావాలి : జనసేనాని శ్రీ @PawanKalyan గారు#JanaSenaTelangana @JanaSenaParty pic.twitter.com/VVLQBx0CaF
— 𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 (@JSPTelangana) October 12, 2021
ఇదీ చదవండి