దళితుల కోసం పోరాడే పార్టీ ఒక్కటి కూడా రాష్ట్రంలో లేదని జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్ అన్నారు. విజయవాడలో ఆ పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్.. ఆ తరువాత 26 రకాల దళిత పథకాలను రద్దు చేశారని విమర్శించారు. వైకాపా దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. తమ పార్టీ తరపున ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసి.. ఆఖరు వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ సభలో జై భీమ్ భారత్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
New Party: రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం - ap news
తాను 28 సంవత్సరాలకు న్యాయమూర్తిని అయ్యానని.. పదేళ్లలో ఆ పదవిని వదిలి వచ్చానన్నారు జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. వైకాపా దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని.. ఆ పార్టీలోని దళిత నాయకులను ఓడించడానికే పార్టీ పెడుతున్నామన్నారు. ప్రజలకు అన్యాయం చేసే వారిని ప్రశ్నిస్తానని తెలిపారు. తమ పార్టీ తరపున ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసి.. చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ రోజు నుండి జైభీమ్ భారత్ పార్టీ రాజకీయం చేస్తుందన్న ఆయన.. పార్టీ మేనిఫెస్టో ను విడుదల చేశారు.