హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులకు సంబంధించిన ఛార్జ్ షీట్ నుంచి విజయ్ సాయిరెడ్డి పేరు తొలగించాలని ఆయన తరఫు న్యాయవాది ఉమా మహేశ్వరరావు వాదనలు కొనసాగించారు. జగతి పబ్లికేషన్స్, రాంకీ, వాన్ పిక్ సీబీఐ చార్జ్ షీట్లపై ఈనెల 23కి.. పెన్నా, భారతీ సిమెంట్స్ కేసుల విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. సీబీఐ ఛార్జ్ షీట్ల కన్నా ముందుగా ఈడీ కేసులను విచారణ జరపాలా వద్దా అనే అంశంపై శుక్రవారం వాదనలు కొనసాగనున్నాయి.
ఇదీ చదవండి