ETV Bharat / city

రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు... తగ్గని గోదావరి ఉద్ధృతి - rain news in ap state

రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. గోదావరి ఉద్ధృతి కారణంగా... తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ లంక గ్రామాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

It rained for two days in the state
రాష్ట్రంలో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు
author img

By

Published : Aug 23, 2020, 7:43 AM IST

ఇవాళ, రేపు.. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అధికారులను అప్రమత్తం చేసింది.

జల దిగ్భంధంలోనే లంక గ్రామాలు

తూర్పుగోదావరి జిల్లాలోని మన్యంతోపాటు కోనసీమ లంక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. జిల్లాలోని 26 మండలాల పరిధిలోని 180 గ్రామాలు వరదకు ప్రభావితమయ్యాయని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని 82 గ్రామాల్లోకి వరద నీరు చేరిందన్నారు. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందగా.... మరో ఇద్దరు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు.

జిల్లాలో 129 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సుమారు 57 వేల 607మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాలకు 2వేల 008 హెక్టార్లలో వరి, 10వేల 624 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని.... ఎటపాక డివిజన్‌లో 8 పంచాయతీల రహదారులు దెబ్బతిన్నాయన్నారు. జిల్లాలో సహాయక చర్యల్లో 45 క్లస్టర్ బృందాలు,14 మొబైల్ బృందాలతోపాటు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు.

ఇవీ చదవండి:

లంక గ్రామాలను రెండుసార్లు కుదిపేసిన గోదావరి వరద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.