ఏపీలో ప్రత్యేక జౌళి విధానం తీసుకురావాలనే యోచనలో ఉన్నామని ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. దిల్లీ వేదికగా జౌళిశాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో జౌళి పెట్టుబడులకు గల అవకాశాలు వివరించామని ఆయన తెలిపారు. ఈ విషయంపై సీఎం జగన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాయుధ బలగాల్లో దుస్తుల అవసరాలను చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ తెలిపారని వివరించారు. టెక్నికల్ టెక్స్‌టైల్స్‌లో పెట్టుబడులకు ఆహ్వానించామని... ముందుకువచ్చే పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
-
Participated in the 11th edition of #IndiaChem2021 in presence of Union Minister Shri @DVSadanandGowda ji,
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Highlighted investment potential in AP for Chemicals & Petrochemicals Industry to transform AP into global petrochemicals manufacturing hub@dcpc2017 @AP_EDB @PIB_India pic.twitter.com/LjCBUAMwco
">Participated in the 11th edition of #IndiaChem2021 in presence of Union Minister Shri @DVSadanandGowda ji,
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) March 17, 2021
Highlighted investment potential in AP for Chemicals & Petrochemicals Industry to transform AP into global petrochemicals manufacturing hub@dcpc2017 @AP_EDB @PIB_India pic.twitter.com/LjCBUAMwcoParticipated in the 11th edition of #IndiaChem2021 in presence of Union Minister Shri @DVSadanandGowda ji,
— Mekapati Goutham Reddy Official (@MekapatiGoutham) March 17, 2021
Highlighted investment potential in AP for Chemicals & Petrochemicals Industry to transform AP into global petrochemicals manufacturing hub@dcpc2017 @AP_EDB @PIB_India pic.twitter.com/LjCBUAMwco
'పెట్రో కెమికల్ కారిడార్‌లో పెట్టుబడులకు అవకాశాలను వివరించాం. ఏపీని పెట్రో కెమికల్స్ ఆధారిత తయారీ హబ్‌గా మారుస్తాం. ఆర్థిక వృద్ధిరేటులోనే కాకుండా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో ఏపీ ముందుంది. పెట్రో కెమికల్ రంగంలో రాష్ట్రం ఎదగడానికి అవకాశం ఉంది. 3 జాతీయస్థాయి పారిశ్రామిక కారిడార్లున్న రాష్ట్రం ఏపీ ఒక్కటే. రాష్ట్రంలోని ప్రతి జిల్లాను కలుపుతూ పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తాం. వివిధ పెట్రో కెమికల్ కంపెనీల సీఈవోలతో భేటీ అవుతున్నాం' - పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
ఇదీ చదవండి