ETV Bharat / city

'లక్షణాలు కనబడని కొవిడ్​ కేసులు భారత్​లోనే ఎక్కువ' - భారతదేశంలో కరోనా కేసుల వివరాలు

లక్షణాలు కనపడని కోవిడ్ పాజిటివ్ కేసులు... ప్రపంచదేశాలతో పోలిస్తే... భారత్‌లోనే అత్యధికం అంటున్నారు... సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా. అసింప్టమాటిక్ కేసుల్లో ఎక్కువమందికి ఎటువంటి చికిత్స అవసరం లేకున్నా... కోలుకుంటారని.. కానీ వైరస్ సంక్రమణ వీరి ద్వారా ఎక్కువగా జరిగే ప్రమాదమని ఆయన పేర్కొన్నారు. ఇందుకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసి.. వైరస్‌ బాధితులను ఐసోలేట్ చేయడం ద్వారానే కరోనావ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని సూచిస్తున్నారు. సీసీఎంబీలో కరోనా వైరస్‌పై జరుగుతోన్న పరిశోధనలు, లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యులో పలు సూచనలు చేశారు.

interview-with-ccmb-director-rakesh-mishra-on-corona-virus-situations-in-india
సీసీఎంబీ డైరెక్టర్​తో రాకేష్​ మిశ్రాతో ముఖాముఖి
author img

By

Published : May 29, 2020, 10:41 AM IST

ప్రశ్న: దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కానీ అన్నీ ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి ఒకేలా లేదు. 10 రాష్ట్రంలోనే 80 శాతానికి పైగా కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం ఏమిటి?

జవాబు: మెట్రో, పెద్ద నగరాల్లో పాపులేషన్, జనసమ్మర్ధత వల్ల సాధారణంగానే వైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంటుంది. కానీ లక్షణాలు కనపడకపోవటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు పరిష్కారం వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించటమే.. కేసులు పెరుగుతున్నంత వేగంగా డెత్ రేట్ పెరగకపోవటం సానుకూలాంశం. మూడు శాతం లోపు డెత్ రేట్ నమోదవటానికి సైతం కో- మార్బిటీస్ లక్షణాల వల్లే ఎక్కువగా తేలుతోంది.

ప్రశ్న: టీకా అందుబాటులోకి రావడానికి ఇంకా కొంత కాలం పడుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు నెలల కాలంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు?

జవాబు: వ్యాక్సిన్ రావటానికి మరింత సమయం పడుతుంది. మరో మూడు, ఆరు నెలల్లో వ్యాక్సిన్ ను ఊహించటం కష్టం. వైరస్ ను మనం ఎదుర్కోవాల్సిందే. సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రతి కొత్త వ్యక్తులను, వస్తువులకు వీలైనంత దూరంగా ఉంటూ ముట్టుకోకపోవటం ఉత్తమం. వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు వీలైనంత ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వ్యక్తులను గుంపు నుంచి వారిని ఐసోలేట్ చేయాలి. లేకుంటే లక్షణాలు లేనివారు వీలైనంత ఎక్కువమందిలో వైరస్ వ్యాప్తికి కారణమవచ్చు. అదే జరిగితే రానున్న రోజులు చాలా ప్రమాదకరంగా మారుతాయి.

ప్రశ్న: లాక్‌డౌన్‌... వైరస్‌ స్థానిక వ్యాప్తిని అడ్డుకుంటుందా ?

జవాబు: దేశవ్యాప్త లాక్ డౌన్ విధింపు వైరస్ వ్యాప్తిని స్లో గా రైస్ అయ్యేలా చేసింది. లాక్ డౌన్ ప్రభుత్వాలకు, ప్రజలకు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మంచి సమయం ఇచ్చింది. లేకుంటే చాలా మంది వేగంగా వైరస్ కు లోనయ్యేవారు. ఆర్థికంగా లాక్ డౌన్ విధింపు నష్టాలను చవిచూసేలా, కొద్దిపాటి ఇబ్బందులకు గురిచేసినా.. వలసలను, ప్రయాణాలను నియంత్రించి వైరస్ సంక్రమణకు అడ్డుకట్ట వేసింది. లాక్ డౌన్ తో ఎక్కువ కాలం మనుగడ కష్టం కనుక.. ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం చూపాలి. ప్రజలను వైరస్ బారినుంచి రక్షించేందుకు మాస్కులు, భౌతిక దూరం, పర్సనల్ హైజీన్ కంపల్సరీ చేయాలి. వైరస్ బాధితులను పరీక్షలతో గుర్తించి వారిని ఇతర ప్రజల్లో కలవకుండా ప్రభుత్వాలు వేరుచేయాలి.

ప్రశ్న: కొవిడ్‌ 19 పరిశోధనల్లో సీసీఎంబీ తాజా పురోగతి ఏంటి ?

జవాబు: సీసీఎంబీలో టెస్టింగ్ సామర్ధ్యం పెంపు, పరీక్షల సమయం తగ్గింపు, 30 నుంచి 40 శాతం టెస్టింగ్ ఖరీదు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం.. ఏకకాలంలో పది, 20 వేలకు పైగా పరీక్షలు చేసే సామర్ధ్యం దిశగా సాగుతున్నాం. వైరస్ లను సెల్ కల్చర్ ద్వారా ల్యాబ్ లో ప్రొడ్యూస్ చేసి వ్యాక్సిన్ తయారీ, ఆంటీ బాడీస్, ఆంటీ డాట్స్ అధ్యయనాలకు వాడుతున్నాం. కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాం. కోవిడ్ ను నియంత్రించేందుకు పలు రకాల డ్రగ్స్ ను పరీక్షిస్తున్నాం. ఇందుకొరకు పలు కంపెనీలు, ప్రభుత్వాలు, డీఆర్ డీవో, ల్యాబ్ లతో కలిసి పనిచేస్తున్నాం. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు కు చెందిన వైరస్ ఐసోలేట్ నుంచి జీనోం సీక్వెన్సింగ్ పై పరిశోధన చేస్తున్నాం.. మా అధ్యయనాల్లో మొదట్లో సింగపూర్, మలేషియా, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా వైరస్ మూలాలు కనిపించాయి. భారత్ లోని వైరస్ కు అమెరికా, చైనా, యూరప్ మూలాలు ఎక్కువ. యూరప్ మూలానున్న ఏ2ఏ వైరస్ ఐసోలేట్ మూలాలు చాలా డామినెంట్ గా ఉన్నాయి. వైరస్ మాలాలు కనుగొంటే.. ఆపటం సులభమవుతుంది.

ప్రశ్న: కరోనా వైరస్‌లో ఏ రకమైన జన్యుమార్పులను మీరు గుర్తించారు.?

జవాబు: ప్రపంచ దేశాలతో పోలిస్తే.. లక్షణాలు లేని కోవిడ్ కేసులు భారత్ లోనే ఎక్కువ. ఇందుకు వైరస్ రకం, భారతీయుల జన్యు వైవిధ్యం ఏదైనా కారణం కావచ్చు. దేశంలో ఎక్కువ మంది యువరక్తం ఉండటం, మన సంప్రదాయాలు, ఆహార అలవాట్లు, ప్రకృతి, జీవనశైలి అనేకం కారణమవుతాయి. వీరిలో లక్షణాలు బయటకు కనపడవు. కానీ వీరు ఐసోలేట్ అవ్వాలి. ఎటువంటి చికిత్స చేయకున్నా.. 14 రోజుల తర్వాత వైరస్ బారినుంచి బయటపడతారు. వేరు పడకుంటే ఆలోగా వీరు వైరస్ సంక్రమణకు కారణమవుతారు. భారత్ లో యువరక్తం ఎక్కువ ఉండటమూ.. అసింప్టమాటిక్ కేసులు, మరియు డెత్ రేట్ తక్కువ ఉండటానికి కారణం. లక్షణాలు లేని వారు ఇతర బలహీనుల సంక్రమణకు కారణమవుతున్నారు. ఇది అది వారికి ప్రాణాంతకం కావచ్చు.

ప్రశ్న: వ్యాధి లక్షణాలు కనిపించని వారు ఏలాంటి వైద్య సహాయం లేకుండానే కోలుకుంటారా ? లేదా వారకీ వైద్య చికిత్స అందించాల్సిందేనా?

జవాబు: లాక్ డౌన్ ఉన్నా.. లేకున్నా.. వైరస్ వ్యాప్తి దృష్ట్యా మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీనికి వ్యాక్సిన్ లేదు. సరైన మందు లేదు. మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రంగా తరుచుగా కడుక్కోవాలి. భాతిక దూరం పాటించాలి. లార్జ్ గ్యాదరింగ్ ను అవాయిడ్ చేయాలి. ఇలా చేస్తే 70 నుంచి 80 శాతం మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ప్రశ్న: రాష్ట్రాలు, దేశంతో పాటు అన్ని రంగాలు పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ను తొలగిస్తే... ప్రజలు ఈ మహమ్మారి నుంచి వారిని వారెలా సంరక్షించుకోవాలి

జవాబు: ప్రభుత్వాలు సైతం పరీక్షల సంఖ్య పెంచాలి. టెస్టింగ్ ధర తగ్గించాలి. ఇందుకొరకు అవసరమైతే ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం చేసుకోవాలి. తద్వారా పాజిటివ్ వ్యక్తులను సమాజంలో ఐసోలేట్ చేయాలి. ఇలా చేయకుంటే పెద్ద సంఖ్యలో వ్యాధిగ్రస్తులవుతారు. వారందరినీ హాస్పిటైలజ్డ్ చేయటం, చికిత్స అందించటం ఆర్థికంగా భారం, వారిలో చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోవచ్చు.

సీసీఎంబీ డైరెక్టర్​తో రాకేష్​ మిశ్రాతో ముఖాముఖి

ఇదీ చదవండి: రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.